బల్కంపేటలో ఘటన
నవతెలంగాణ- ముషీరాబాద్
హైదరాబాద్ నగరవ్యాప్తంగా బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన బల్కంపేటలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. భోలక్‌పూర్‌లో నివాసం ఉంటున్న షర్ఫుద్దీన్ బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి బైక్‌పై వస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బల్కంపేట రైల్వే బ్రిడ్జి కింద పెద్దఎత్తున వరద నీరు చేరింది. లోతు గమనించుకోకుండా ముందుకు వెళ్లడంతో వరద ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయాడు స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే యువకుడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికెళ్లి.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు సూచించారు.
వరద నీటిలో కొట్టుకుపోయి యువకుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES