– అడిషనల్ ఎస్పీ రంగ ప్రవేశం తో సద్దిమనిగిన వివాదం
నవతెలంగాణ- ముధోల్
ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో దుర్గా మాత నిమజ్జనం శోభాయాత్రలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరటంతో సౌండ్ సిస్టం మీద ఉన్న యువకుడికి తగిలింది. గాయపడ్డ యువకుడికి ఆసుపత్రికి తరలించారు. దీంతో నిమజ్జన శోభాయాత్ర తాత్కాలికంగా ఆగిపోయింది. ఇరు గ్రూపుల మధ్య వాగ్వివాదం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సిఐ మల్లేష్, ఎస్ఐలు పోలిసులు, హుటహుటిన గ్రామానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు.
రాత్రి 7:30 ప్రాంతంలో దుర్గ మాత నిమజ్జన శోభాయాత్రను అడిషనల్ ఎస్పీ జోక్యంతో ముందుకు కదిలింది. దుర్గామాతను నిమజ్జన కోసం గ్రామస్తులు గోదావరి నదికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ ఐ నారాయణరావు పటేల్, రెవెన్యూ సిబ్బంది, గ్రామానికి చేరుకొని పలు వివరాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన పై అడిషనల్ ఎస్పి విలేకరులతో మాట్లాడారు. దుర్గ మాత నిమజ్జనం శోభయాత్ర జరుగుతున్నప్పుడు రాయి దాడిలో ఓ యువకుడికి గాయమైందని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసిన్నట్టు చెప్పారు. గ్రామస్తులు సహకరించాలని కోరారు.