– మెదక్ జిల్లా మంజీరానది వద్ద ఘటన
నవతెలంగాణ- కొల్చారం
ఘనపూర్ ఆనకట్ట దిగువ భాగంలోని మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లి నదిలో పడి యువకుడు గల్లంతైన సంఘటన సోమవారం జరిగింది. కొల్చారం పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన బుడ్డెన్నోళ్ల సురేష్ (23) సోమవారం సాయంత్రం మంజీరా ప్రవాహం తగ్గడంతో ఆనకట్ట దిగువ భాగంలోని నది పాయలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. అదుపుతప్పి నదిలో పడి గల్లంతయ్యాడు. వెంటనే స్థానిక జాలర్లు కొల్చారం పోలీసులకు సమాచారం అందించడంతో కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ మొయినుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పిలిపించి యువకుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES