నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఓ లేడీ అభిమాని అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. తెలంగాణ భవన్ లో కేటీఆర్… తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనగా.. అక్కడికి వచ్చిన ఓ మహిళ
సెల్ఫీ దిగినట్లే దిగి కేటీఆర్ కు ముద్దు పెట్టబోయింది. దీంతో చాకచక్యంగా కేటీఆర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక అటు తెలంగాణ గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తండ్రి కెసిఆర్ వద్ద కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.