నవతెలంగాణ- రాజోలి
రాజోలి మండల కేంద్రంలో ఆధార్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం కెవిపిఎస్ ఆధ్వర్యంలోరాజోలి తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అల్లంపూర్ తాలూకాలోని అత్యధిక జనాభా కలిగిన మేజర్ గ్రామపంచాయతీ రాజోలి గ్రామమని, ఈ రాజోలి మండల కేంద్రం నుంచి పరుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కు మరియు కర్ణాటక రాష్ట్రాలకు నిత్యము రాకపోకలు ఉన్నాయని అన్నారు. అటువంటి రాజోలి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. పిల్లలు రైతులు విద్యార్థులు ఆధార్ కార్డు కొరకు దిగాలంటే పరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు మరియు బెలగల్ మండలాలకు వెళ్లి దిగుతున్నారని, రెండు మూడు రోజులు చార్జీలు పెట్టుకొని వందలు ఖర్చు చేసి వేలకు వేలకు అడుగుతున్నారని అన్నారు.
రాజోలి మండల కేంద్రంలో 11 గ్రామాలకు ఆధార బిందువైనటువంటి రాజోలు గ్రామానికి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఆధార్ కేంద్రం లేనందువల్ల రైతులు విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇట్టి విషయమై పై అధికారులు స్పందించి తక్షణమే ఆధార్ కేంద్రము ఏర్పాటు చేయాలని లేనియెడల జిల్లా కలెక్టర్ ముందు రాజోలి మండలం గ్రామాల అందరూ కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి విజయకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల ఉపాధ్యక్షులు ఆనంద్ బాబు తుమ్మిల కెవిపిఎస్ గ్రామ అధ్యక్షుడు సుధాకర్ నరసింహులు రైతులు పాల్గొన్నారు అనంతరం తహసిల్దార్ రామ్మోహన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ,
రాజోలిలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి: కేవీపీఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



