- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
పోస్టాఫీసులో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రజలు వినియోగించుకోవాలని మిర్యాలగూడ ప్రధాన పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ బాణావత్ ప్రతాప్ సింగ్ నాయక్ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నూతన ఆధార్ కార్డు నమోదు, పేర్ల మార్పు, పుట్టిన తేదీ మార్పు, లింగం, ఫోన్ నెంబర్ నమోదు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. ఆధార్ లో సవరణలు చేయాల్సిన వాటిని తక్కువ ఖర్చుతో చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్నిటిని ఉచితంగా మరి కొన్నిటిని నామినల్ ఫిజులతో ఆధార్ మార్పులు, చేర్పులు, నమోదు చేస్తున్నందున మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- Advertisement -



