Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంసామాన్యులకే ఆప్‌ టికెట్‌ : కేజ్రీవాల్‌

సామాన్యులకే ఆప్‌ టికెట్‌ : కేజ్రీవాల్‌

- Advertisement -

లుథియానా (పంజాబ్‌) : పని ద్వారా ప్రజల విశ్వాసం, మద్దతు సంపాదించే సామాన్య ప్రజలకే ఎన్నికల టికెట్లు ఇవ్వడానికి పార్టీ కట్టుబడి ఉందని గురువారం ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. లుథియానాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘ఆప్‌ సంప్రదాయ రాజకీయ పార్టీలకంటే భిన్నంగా ఉంటుంది. డబ్బు, వారి ప్రభావం లేదా కుటుంబ నేపథ్యం ఆధారంగా టిక్కెట్లు పంపిణీ చేయదు’ అని అన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ సామాన్య ప్రజలకు టిక్కెట్లు ఇచ్చే పార్టీ. మీరు చేసే పని ఆధారంగానే మీకు టికెట్‌ లభిస్తుంది. కేజ్రీవాల్‌ ప్రజలకు నచ్చిన వ్యక్తికి టికెట్‌ ఇస్తారు అని ఆయన అన్నారు. అలాగే సాధారణ ప్రజలు, నిజాయితీపరులు, సమర్థులైన వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురావడానికి, జావాబుదారీతనం ప్రజా కేంద్రీకృత పాలనను నిర్ధారించడానికి పార్టీని స్థాపించినట్లు కేజ్రీవాల్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -