- Advertisement -
డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”ఆసరా” పెన్షన్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకులు బుర్ర రాము గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఆసరా పెన్షన్లు రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగులకు రూ.4 వేల నుంచి ఆరు వేలకు పెంచుతామన్న హామీని అమలు చేయాలని కోరారు. ఆసరా పెన్షన్‌దారుల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -



