Sunday, April 5, 2026
E-PAPER
Homeసినిమామేఘాంశ్‌ శ్రీహరి హీరోగా 'ఆస్మాన్‌' ప్రారంభం

మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా ‘ఆస్మాన్‌’ ప్రారంభం

- Advertisement -

శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌గా ‘ఆస్మాన్‌’ మూవీని కొండారు వెంకటేష్‌, శ్రీకాంత్‌ మన్నెం నిర్మిస్తున్నారు.
మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్‌ నందన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్‌, సందీప్‌ కిషన్‌, విశ్వక్‌ సేన్‌, నిహారిక కొణిదెల, రోషన్‌ కనకాల, తిరువీర్‌, నార్నే నితిన్‌, రామ్‌ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్‌ క్లాప్‌ కొట్టగా, సందీప్‌ కిషన్‌ స్విచ్‌ ఆన్‌ చేశారు.
నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా, తొలి సన్నివేశా నికి రామ్‌ నందన్‌ దర్శకత్వం వహించారు.
మేఘాంశ్‌ శ్రీహరి మాట్లాడుతూ, ‘నిర్మాతలు వెంకటేష్‌, శ్రీకాంత్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్‌ నందన్‌ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్‌బస్టర్‌ కొట్టబోతున్నాం’ అని తెలిపారు.
‘తెలుగులో నాకు ఇది తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్‌, శ్రీకాంత్‌కు థ్యాంక్స్‌. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌తో రాబోతోన్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది’ అని డైరెక్టర్‌ రామ్‌ నందన్‌ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ,’మా శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌గా రాబోతున్న ఈ నూతన చిత్రాన్ని మేఘాంశ్‌ శ్రీహరితో చేస్తుండటం ఆనందంగా ఉంది. రామ్‌ నందన్‌ ‘ఆస్మాన్‌’ అంటూ అద్భుతమైన కథతో సినిమాని తెరకెక్కించనున్నారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -