కొత్తగా మూడు హైస్పీడ్ రైళ్లు
తెలంగాణను పట్టించుకోలేదన్న సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పట్టించుకోలేదు. 2026-బడ్జెట్‌లో గతంలో ఇచ్చిన అనేక హామీలను పక్కనపెట్టేసింది. సాధారణ ప్రయాణీలను పక్కనపెట్టేసింది. కొత్తగా హైస్పీడ్ రైళ్ల పేర మూడింటిని మంజూరు చేసింది. కాగా, పాత హామీలకు పాతరేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృపి వ్యక్తం చేసింది. ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను అనేక సందర్భాల్లో కలిసి వినతిపత్రాలు ఇచ్చి విజ్ఞప్తుల చేసినా ఫలితం లేకపోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. తెలంగాణలోని పాత ప్రాజెక్టులు, వాటికి నిధులు, భూసేకరణ, ఇతర విషయాలపై స్పష్టత కొరవడింది. దాదాపు రూ. 800 కోట్ల మేర ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు నిధులు అవసరం. వీటి గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
ఇదిలావుండగా హైదరాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ హైదరాబాద్ కనెక్టివిటీని సమూలంగా మార్చేసేలా భారీ ప్రకటన చేశారని అంటున్నది. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లల్లో మూడింటిని హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించడం పట్ల కొన్ని శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఈ నిర్ణయంతో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ఒక ప్రధాన రవాణా హబ్‌గా అవరించనుందనే ప్రచారం జరుగుతున్నది.
మూడు ప్రధాన మార్గాలు
1. పుణె-హైదరాబాద్: పశ్చిమ భారతంతో భాగ్యనగరాన్ని వేగంగా అనుసంధానించనుంది.
2. హైదరాబాద్-చెన్త్నయ్: ఓడరేవు నగరంలో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచనుంది.
3. హైదరాబాద్-బెంగళూరు: రెండు ఐటీ దిగ్గజ నగరాల మధ్య వేగం దూరాన్ని తగ్గించబోతున్నది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే రైలులో కనీసం 8 నుంచి 12 గంటల సమయం పడుతుండగా,ఈ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని అంచనా. గంటకు 250 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల మూలంగా నగరాల మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది. ఉదయం బెంగళూరు వెళ్లి పని ముగించుకుని సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చని చెబుతున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే, అలాగే ఈకారిడార్ల వెంట పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పడనున్నాయి. దీంతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా.
చెన్త్నరు, పుణే వంటి నగరాల నుంచి పర్యాటకులు తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకునే వీలు కలగటంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత పెరగనుంది. ఈ హైస్పీడ్ రైళ్లు ఆగే స్లేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరిగి, రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ కారిడార్లు కేవలం రైలుమార్గాలు మాత్రమే కాదనీ, భారత అర్థిక వ్యవస్థకు వృద్ధి కారిడార్లని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కోన్నారు. ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు స్ఫూర్తితో ఈ కొత్త మార్గాలను స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ తాజా పరిస్థితి
మౌళిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగానే మూడు హైస్పీడ్ రైళ్లను తెలంగాణకు మంజూరు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఎంఆర్‌టీఎస్)తో మెట్రో ప్రాజెక్టు కోసం రూ. 28,740 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ -1 విలీన ప్రక్రియ పూర్తిచేయగానే ఫేజ్-2కు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. తాజా బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి నిధులు ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దూర ప్రాంతాలకు రైల్వే సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకున్నట్టు అంటున్నారు. కొనసాగుతున్న ఆయా ప్రాజెక్టులకు దాదాపు రూ. 12.2 లక్షల కోట్ల నిధుల సాయం అందనుందని అభిప్రాయపడుతున్నారు.
ఫేజ్-2కు నిధులు ఇస్తాం: కిషన్‌రెడ్డి
మెట్రో ఫేజ్-2 నిధులు కేంద్రం ప్రభుత్వం ఇవ్వనుందని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే ఇది ఫేజ్-1 విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాతేనని వివరించారు. అలాగే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ అందిన తర్వాత నిధులు ఇస్తామని ఆదివారం ఢిల్లీలో ప్రకటించారు.
పాత హామీలకు పాతర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



