– పాఠశాల కరస్పాండెంట్ సామల బాల్ రాజు
నవతెలంగాణ – ఊరుకొండ
విద్యార్థినీ విద్యార్థులు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మేధావుల జీవిత చరిత్రలు చదవాలని పాఠశాల కరస్పాండెంట్ సామల బాల్రా జు అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలోని శ్రీ వేంకట బాల్ రామయ్య పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ సామల బాల్ రాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన సేవలు మరువలేనివని.. అందుకే ప్రపంచ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జార్జ్ జోసెఫ్, వైస్ ప్రిన్సిపాల్ రామ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్ కలామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES