నవతెలంగాణ-హైదరాబాద్: 24 రోజుల ఇరాన్-అమెరికా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ లభించిన విషయం తెలిసిందే. అకారణంగా ఇరాన్ పై ఫిబ్రవరి 28న దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్‌తో అనేక మందిని ట్రంప్ బలితీసుకున్నాడు. భారీ మొత్తంలో విధ్వంసం సృష్టించి చమురు సంక్షోభానికి తెరలేపాడు. ట్రంప్ చర్యలపై, నిర్ణయాలపై ప్రపంచ దేశాలు తీవ్ర అగ్రహాంతో ఉన్నాయి. ఈక్రమంలోనే ట్రంప్ పశ్చిమాసియా యుద్ధానికి తాను కారణం కాదంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు.తన స్వంత డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ను ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి బాధ్యుడిగా చూపించారు. టెన్నెస్సీలోని మెంఫిస్‌లో జరిగిన “Safe Task Force” రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హెగ్సెత్ మాత్రం ఈ సమావేశంలో ఏమీ స్పందించలేదు. ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా చమురు సరఫరా ప్రభావితమవుతోంది. గ్లోబల్ మార్కెట్లు, ఆయిల్ ధరలు కూడా హెచ్చుతగ్గులు చూపిస్తున్నాయి.



