నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం సబ్ కలెక్టర్గా అభిగ్యాన్ మాల్వియా బాధ్యతలు స్వీకరించినారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 972, 2023 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అభిగ్యాన్ మాళవీయ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ పేస్ – ll, ట్రైనింగ్ ముస్సోరి లో పూర్తిచేసుకుని సబ్ కలెక్టర్ గా నేడు బాధ్యతలు స్వీకరించారు. గతం లో ఆదిలాబాద్ జిల్లాలో ఒక సంవత్సరం పాటు ట్రేని ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించారు.
అటుపై రెండు నెలలు ఢిల్లీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రి వద్ద అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించానన్నారు. అనంతరం ముస్సోరి ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీ లో ట్రైనింగ్ పూర్తిచేసుకుని సబ్ కలెక్టర్ గా బాధితులను చేపట్టానన్నారు. ఇకపై ప్రాంతంలో తన వంతు అభివృద్ధిలో పాత్రను నిర్వర్తిస్తానన్నారు.
ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా అభిగ్యాన్ మాల్వియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES