Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభినవ దానకర్ణుడు కేతిరెడ్డి సోమ నర్సింహారెడ్డి

అభినవ దానకర్ణుడు కేతిరెడ్డి సోమ నర్సింహారెడ్డి

- Advertisement -

లక్షలాది రూపాయలతో విద్యాభివృద్ధికి చేయూత 
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ 
నవతెలంగాణ – పెద్దవంగర

అభినవ దానకర్ణుడు కేతిరెడ్డి సోమ నర్సింహారెడ్డి అని, ఆయన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ అభివర్ణించారు. బొమ్మకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దీపికా- సోమ నర్సింహారెడ్డి దంపతుల కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి రూ. లక్ష విలువైన టెబుల్స్, విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, మైక్ సెట్ అందజేశారు. అనంతరం పాఠశాల హెచ్ఎం లీలా శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సోమ నర్సింహారెడ్డి లక్షలాది రూపాయలు వెచ్చించి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనివ్వడం ప్రశంసానీయం అన్నారు. పాఠశాలల బలోపేతానికి, లయన్స్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం ఆయన సేవా నీరతికి నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఆయనను ఆదర్శంగా తీసుకుని, ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి నేను సైతం అంటూ, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ఎంత సంపాదించినా లభించని తృప్తి, ఇతరులకు సాయం పడటం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే లభిస్తుందన్నారు. సేవ చేయడానికి, ఇతరులకు సహాయ పడటానికి కూడా ఒక హద్దు ఉంటుందని, కానీ తండ్రి కొడుకులకు ఈ హద్దులేమీ లేవని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ తండ్రి కొడుకులు ఇద్దరు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అవసరార్థులకు సేవ చేయడం ద్వారానే ఆత్మ సంతృప్తి చెందుతుందని స్పష్టం చేశారు. దాతలు అందిస్తున్న సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చదువుతోనే ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపడతారని పేర్కొన్నారు. జ్ఞానాన్ని పెంపొందించుకుని, విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని సూచించారు. చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని, తద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు ఇప్పటినుండే ప్రణాళిక రూపొందించుకొని చదువుకోవాలన్నారు. సమయాన్ని వృధా చేసుకోకుండా, క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సునీల్, శ్రీనివాస్, సురేష్, హరీష్, కమలాకర్, బాలరాజు, సత్యం రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకటరామయ్య, గిరగాని రవి, గంగాధర్, సమ్మయ్య, రామ్మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -