తొలి టి20లో న్యూజిలాండ్ చిత్తు
48పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
నాగ్‌పూర్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఓపెనర్ అభిషేక్ శర్మ ధనా ధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. చివర్లో రింకు సింగ్ 20బంతుల్లోనే 44 పరుగులు చేయడంతో భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 238పరుగుల భారీస్కోర్ చేసింది. అనంతరం న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు కోల్పోయి 190పరుగులే చేయగల్గింది. ఛేదనలో భాగంగా కివీస్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్(78; 40బంతుల్లో 4ఫోర్లు, 6సిక్సర్లు) పోరాటానికి తోడు ఛాప్మన్(39), మిఛెల్(28), రాబిన్సన్(21) బ్యాటింగ్‌లో రాణించారు. భారతజట్టు బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, దూబేకు రెండేసి, ఆర్ష్‌దీప్, హార్దిక్, అక్షర్ పటేల్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
తొలుత టి20 సంచలనం అభిషేక్ శర్మ కేవలం 35బంతుల్లోనే 5ఫోర్లు, 8సిక్సర్లతో 84పరుగులు చేశాడు. ఈ క్రమంలో 22బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. చివర్లో రింకూ సింగ్(44నాటౌట్; 20బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు తన మార్క్ స్ట్రోక్ ప్లేతో రెచ్చిపోయాడు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 238పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు తన మొదటి ఓవర్లోనే జేమీషన్ షాకిచ్చాడు. ఓపెనర్ సంజూ శాంసన్(10) వికెట్ కోసం ఫీల్డర్‌ను మిడ్‌వికెట్‌కు మార్చి ఫలితం రాబట్టాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్(8) మొదటి బంతినే ఫోర్‌గా మలిచాడు. అయితే.. డఫ్పీ ఓవర్లో మిడ్‌వికెట్లో ఆడబోయిన అతడు అక్కడే కాచుకొని ఉన్న చాప్‌మన్ చేతికి చిక్కాడు. దాంతో.. 27పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ కొట్టాడు. అనంతరం జేమీసన్ ఓవర్లో అభిషేక్ శర్మ(84) స్ట్రెయిట్‌గా భారీ సిక్సర్ సంధించాడు. వీరిద్దరి జోరుతో పవర్ ప్లేలో 68 పరుగులు చేసింది. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో భారతజట్టు 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో టి20 రారుపూర్ వేదికగా శుక్రవారం జరగనుంది.
హ్యాట్రిక్ ఫోర్లతో..
గ్లెన్ ఫిలిప్స్ వేసిన 8వ ఓవర్లో అభిషేక్ మరింత రెచ్చిపోయాడు. వరుసగా తొలి మూడు బంతుల్ని బౌండరీ లైన్ దాటించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 25 కంటే తక్కువ బంతుల్లోనే అతడు మెరుపు హాఫ్ సెంచరీ బాదేయడం ఇది ఎనిమిదోసారి. ఫాంలోకి వచ్చినట్లు కనిపించిన కెప్టెన్ సూర్యకుమార్ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. సెంచరీకి చేరువైన అభిషేక్‌ను ఇష్ సోధీ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(25) ఉన్నంతసేపు స్కోర్‌బోర్డు పరుగెత్తింది. ఆఖర్లో రింకూ సింగ్(44 నాటౌట్) తన స్టయల్ విధ్వంసం సృష్టించాడు. చివరి ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లతో 21 పిండుకొని స్కోర్ 238పరుగులకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్, డఫీకి రెండేసి, క్లార్క్, ఇష్ సోథీకి ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
ఇండియా ఇన్నింగ్స్: సంజు శాంసన్ (సి)రచిన్ రవీంద్ర (బి)జేమీసన్ 10, అభిషేక్ శర్మ (సి)జేమీసన్ (బి)ఇష్ సోథీ 84, ఇషాన్ కిషన్ (సి)ఛాప్మన్ (బి)డఫీ 8, సూర్యకుమార్ యాదవ్ (సి)రాబిన్సన్ (బి)సాంట్నర్ 32, హార్దిక్ పాండ్యా (సి)చాప్మన్ (బి)డఫీ 25, దూబే (సి అండ్ బి)జేమీసన్ 9, రింకు సింగ్ (నాటౌట్) 44, అక్షర్ పటేల్ (సి)మిఛెల్ (బి)క్రిస్టియన్ క్లార్క్ 5, ఆర్ష్‌దీప్ (నాటౌట్) 6, అదనం 15. (20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 238పరుగులు.
వికెట్ల పతనం: 1/18, 2/27, 3/126, 4/149, 5/166, 6/185, 7/209
బౌలింగ్: డఫీ 4-0-27-2, జేమీసన్ 4-0-54-2, క్రిస్టియన్ క్లార్క్ 4-0-40-1, ఇష్ సోథీ 3-0-38-1, ఫిలిప్స్ 1-0-20-0, సాంట్నర్ 3-0-37-1, మిఛెల్ 1-0-21-0
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి)సంజు (బి)ఆర్ష్‌దీప్ 0, రాబిన్సన్ (సి)దూబే (బి)వరుణ్ చక్రవర్తి 21, రచిన్ రవీంద్ర (సి)అభిషేక్ (బి)హార్దిక్ 1, ఫిలిప్స్ (సి)దూబే (బి)అక్షర్ 78, చాప్మన్ (సి)అభిషేక్ (బి)వరుణ్ చక్రవర్తి 39, మిఛెల్ (సి)బిష్ణోరు (బి)దూబే 28, సాంట్నర్ (నాటౌట్) 20, క్రిస్టియన్ క్లార్క్ (సి)రింకు సింగ్ (బి)దూబే 0, జేమీసన్ (నాటౌట్) 1, అదనం 2. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 190 పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/1, 3/52, 4/131, 5/143, 6/189, 7/189
బౌలింగ్: ఆర్ష్‌దీప్ 4-0-31-1, హార్దిక్ పాండ్యా 2-0-20-1, బుమ్రా 3-0-29-0, అక్షర్ పటేల్ 3.3-0-42-1, వరుణ్ చక్రవర్తి 4-0-37-2, దూబే 3-0-28-2, అభిషేక్ శర్మ 0.3-0-3-0.
తొలుత అభిషేక్.. చివర్లో రింకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



