రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా మత్స్య అధికారిణి కోమటిరెడ్డి చరిత రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కేతేపల్లి మండలం బొప్పారం గ్రామం మత్స్య సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ఆమోదం ఇవ్వడానికి” రూ .70 వేలు డిమాండ్ చేసి రూ.50వేలకు ఒప్పందం చేసుకొని రూ.20వేల నగదును గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ఉన్న జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో ఆమోదం ఇవ్వడానికి” డిమాండ్ చేసి స్వీకరించింది.
ఫిర్యాదుదారుదు ఏసీబీని ఆశ్రయించడంతో లంచం తీసుకుంటుండగా రేంజ్ యూనిట్, ఏసీబీ డీఎస్పీ. జగదీష్ చందర్ విచారణ చేసి దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారుడు అనుకున్న ఒప్పందం ప్రకారం రూ.50000 సమకూరకపోవడంతో రూ.20000 ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని గమనిస్తున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హ్యాండ్ బ్యాగ్ నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించి అరెస్టు చేసి, ఏసీబీ కేసుల కోర్టు, నాంపల్లి, హైదరాబాద్ తరలించారు. ఈ కేసు కు సంబంధించి ఇంకా ఏమైనా ఆధారాల కోసం మత్స్యశాఖ అధికారి ఇంట్లో సైతం సోదాలను నిర్వహించనున్నట్లు డి.ఎస్.పి వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో ఏసీబీని ఆశ్రయించండి..
ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రజలు అవినీతి నిరోధక శాఖ, యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను. అంటే 1064ను సంప్రదించాలని అభ్యర్థించారు. అవినీతి నిరోధక శాఖ, తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా సంప్రదించవచ్చు. అంటే వాట్సప్ (9440446106), ఫేస్బుక్ (తెలంగాణ ఏసీబీ), X/గతంలో ట్విట్టర్ (@TelanganaACB). ఫిర్యాదుదారు/బాధితుడి పేరు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని పేర్కొన్నారు.