- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కోఆపరేటివ్ అధికారి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జి అధికారి రాథోడ్ బిక్కు నాయక్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ ఉద్యోగికి పెరిగిన వేతనాల మంజూరు, సస్పెన్షన్ ఎత్తివేత కోసం రూ.7 లక్షలు డిమాండ్ చేసి.. చివరికి రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. శనివారం ఉదయం డీసీవో నివాసంలో రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



