Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెక్పోస్టులో ఏసీబీ అధికారుల దాడులు

చెక్పోస్టులో ఏసీబీ అధికారుల దాడులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులో మహారాష్ట్రకు బార్డర్ లో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ అంతర్ రాష్ట్ర ఆర్టీవో చెక్పోస్టులో శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. అధికారుల దాడులతో ఒక ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ వసూళ్లు రూ.36వేల స్వాధీనం చేసుకున్నారు. ఈ చెక్పోస్టులో నాలుగు నెలల క్రితం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేయడం అప్పట్లో రూ.92 వేల లారీ డ్రైవర్ల వద్ద అక్రమ వసూలు జమ అయిన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏసీబీ దాడులు జరిగిన ఇక్కడ చెక్పోస్ట్ అధికారులు అక్రమ వసూళ్లను ఆపడం లేదు 161 వ జాతీయ రహదారి పైన గల అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్పోస్టులో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపణలపైన ఆకస్మిక దాడులు చేయడం జరిగిందని ఏసీబీ అధికారుల వాదన.

అర్థరాత్రి వేళ దాడులు జరిపినప్పటికీ ఏసీబీ అధికారులు స్థానిక విలేకరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎవరో కల్చారని వారికి చెప్పామని వెళ్లిపోయారు.అంతర్రాష్ట్ర చెక్పోస్టులో జరిగే దాడుల పట్ల ఏసీబీ అధికారులు స్థానిక మండల విలేకరులకు సమాచారం ఇవ్వకుండా వచ్చాము. దాడులు చేశాము ..వెళ్లిపోయాము.. అనే రీతిలో అసలైన సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోవడం స్థానిక విలేకరులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వసూళ్లపై ఆకస్మిక దాడులతో పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తున్నప్పటికీ ఏసీబీ అధికారులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా అలాగే వెళ్లిపోవడంపై ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడులు జరిగినప్పుడు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని మండల విలేకరులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -