Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయ శాఖ ఏడీఏ ఇంటిపై ఏసీబీ దాడులు

వ్యవసాయ శాఖ ఏడీఏ ఇంటిపై ఏసీబీ దాడులు

- Advertisement -

ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఫిర్యాదు
ఏకకాలంలో ఏడుచోట్ల.. స్వగ్రామం పొనుగోడులోనూ సోదాలు
ొ గతంలో సూర్యాపేట జిల్లాలో డీఆర్డీఏ పీడీగా సుందరికిరణ్‌ విధులు


నవతెలంగాణ-గరిడేపల్లి

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడులో వ్యవసాయ శాఖ ఏడీఏగా పనిచేస్తున్న సుందరికిరణ్‌ ఇంటిపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం 5 గంటలకే కిరణ్‌ స్వగ్రామమైన పొనుగోడులోని ఇంటికి అధికార బృందాలు చేరుకున్నాయి. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. సుమారు 7గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనేక విషయాలపై ఆరా తీశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఏడీఏ కిరణ్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్నారన్నారు.

కిరణ్‌కు సంబంధించిన ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించామని తెలిపారు. నేరేడుచర్ల పట్టణంలో భాగస్వామ్యం ఉన్న అవని రైస్‌మిల్లు, గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలోని అత్తగారిల్లు, కూతురు గ్రామమైన అనంతగిరి మండలంలోని అమీనాబాద్‌, సూర్యాపేట పట్టణంలోని ప్రస్తుత నివాసం, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని కిరాయి ఇంటిలో దాడులు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. నేరేడుచర్ల పట్టణంలో నల్లగొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌ చంద్ర ఆధ్వర్యంలో సోదాలు నిర్వ హించామని, పూర్తిస్థాయిలో వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు. అనంతరం పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -