ఎడి సర్వేయర్ శ్రీనివాస్ పై దాడులు
ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదుతో ఏడీ సోదాలు
ఆరు ప్రాంతాల్లో ఏసీబీ బృందాల దాడులు
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి జిల్లా ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులకు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో ఆరు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దాంతో కలెక్టరేట్లో ఒకసారి కలకలం చెలరేగింది. క్షేత్ర స్థాయి అధికారులు మొదలుకొని, ఐఏఎస్ అధికారుల కొరకు పట్టుపడుతుండటంతో తీవ్ర విమర్శలు పెట్టమవుతున్నాయి. ఏడీ సర్వే శ్రీనివాస్ పై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని ల్యాండ్ సర్వే కార్యాలయంలో సోదాలు కొనసాగుతుండగా గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్, ఆయన ఇంటిపై సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఈడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయ్ దుర్గ, మై హోమ్ బుజాలో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ లో ఏసీబీ దాడులు కొనసాగడం ఇది రెండవసారి. 2024 ఆగస్టు మాసంలో అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి పై సైతం ఎసీబీ దాడులు కొనసాగాయి. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ ఆయన పట్టు బడిన విషయం తెలిసింది.
నేడు అక్రమ ఆస్తుల ఫిర్యాదు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఎడి సర్వేయర్ శ్రీనివాస్ పై సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన అక్రమ ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



