– రూ.28 వేలు నగదు స్వాధీనం
– ముగ్గురు ప్రయివేట్ వ్యక్తులు గుర్తింపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అనధికారిక వ్యక్తులతో అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న రాష్ట్ర సరిహద్దు రవాణా చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారుల బృందం శనివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కొంత నగదుతో పాటు కొందరు ప్రయివేట్ అదుపులోకి తీసుకున్నారు. నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఏసీబీ డీఎస్సీ వై. రమేష్ తెలిపారు. పట్టణంలోని నందమూరి నగర్ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర సరిహద్దు అదికారులు కొందరు ప్రయివేట్ వ్యక్తుల ద్వారా అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులకు పిర్యాదులు అందటంతో ఏసీబీ డీఎస్సీ వై.రమేష్ నేతృత్వంలోని బృందం శనివారం రాత్రి 12.30 లకు సోదాలు నిర్వహించింది.
ఆదివారం ఉదయం 5.30 గంటల వరకు తనిఖీలు నిర్వహించి లెక్క చూపని అదనంగా ఉన్న రూ.28 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.వసూళ్ళకు పాల్పడుతున్న ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుతున్నారు.చెక్పోస్ట్ లావా దేవీల పై ఇన్చార్జ్ ఆర్టీవో జనార్ధన్ నుండి వివరాలు సేకరించారు.అనంతరం డీఎస్సీ రమేష్ విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులు ద్వారా వాహనాల నుండి ఆర్టీఏ అధికారులు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నట్లు పిర్యాదులు అందాయని, దానితో దాడి నిర్వహించిన నగదు, ప్రయివేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. దాడిలో సుమారు 10 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీఏ చెక్ పోస్ట్ లో ఏసీబీ సోదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES