Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

- Advertisement -

– టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌ తదితర విభాగాలపై ఆకస్మిక తనిఖీలు
– గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి సైబరాబాద్‌ కార్పొరేషన్‌ వరకు అనేక ఆరోపణలు
నవతెలంగాణ-మియాపూర్‌

రంగారెడ్డి జిల్లా సైబరాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్‌లో శుక్రవారం ఏసీబీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌ తదితర విభాగాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి సైబరాబాద్‌ కార్పొరేషన్‌ వరకు అనేక ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి సర్కిల్‌ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, శానిటేషన్‌ సహా వివిధ విభాగాల్లో అధికారుల ఆ వ్యక్తుల వారీగా విచారణ కొనసాగిస్తున్నారు. అత్యధికంగా టౌన్‌ ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, శానిటేషన్‌ విభాగాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. వాటి దృష్ట్యా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భవిష్యత్తులోనూ ఈ సోదాలపై సమగ్ర దర్యాప్తు చేసి, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనేక సంస్థలు, ప్రజాసంఘాల నాయకులు శేరిలింగంపల్లి సర్కిల్‌లోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఏసీపీ టీపీఎస్‌, ఇతర అధికారులపై పలుమార్లు ఫిర్యాదులు చేశారని, వాటిపై సమగ్ర దర్యాప్తునకు కేసు నమోదు చేసి, ఏసీబీ ముందుకు వెళ్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -