Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ 

స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ 
ఆలేరు ఐటిఐ, ఏటీసీలో ప్రవేశాల కొరకు ఆసక్తిగల యువతి యువకుల నుండి స్వల్పకాలిక కోర్సులకు ఈనెల 09 నుండి షార్ట్ టర్మ్ కోర్సులు [స్వల్పకాలిక కోర్సులు] రెండు వారల వ్యవధిలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆలేరు నందు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ బి హరికృష్ణ శనివారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు.  

బేసిక్ కోర్స్ ఆన్ సి యన్ సి  లెత్ మెషిన్, ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్, బేసిక్ కోర్స్ ఆన్ సి యన్ సి మిలింగ్ మెషిన్ ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్, అవేర్నెస్ కోర్స్ ఆన్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, జూనియర్ రోబోట్ ఆపరేటర్ & ప్రోగ్రామర్ – ఆర్క్ వెల్డింగ్,బేసిక్ కోర్స్ ఆన్  ఇ వి జూనియర్ ప్రోడక్ట్ డిజైర్ యూసింగ్ క్యాడ్ -2డీ అండ్ 3డీ  ఫీచర్స్ విభాగాలు ఉంటాయన్నారు.

ఈ ప్రవేశాల కొరకు ఎస్ఎస్సి  చదువుకొని ఉత్తీర్ణులైన వారు, 18 సంవత్సరాలు నిండిన ఆసక్తి గల యువతీ, యువకులు  షార్ట్ టర్మ్ కోర్సులు  [స్వల్పకాలిక కోర్సుల] కు హాజరు కావాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు  ఒరిజినల్ మరియు జీరాక్స్, కాపీ సర్టిఫికెట్లు, మరియు బయోడేటా తీసుకొని ఈ ప్రవేశాల కొరకు హాజరు కావాలని సూచించారు.

 ప్రవేశాలకు  సంబంధించి ఇతర వివరాల గురించి  బి హరిక్రిష్ణ ప్రిన్సిపాల్  ఫోన్ నెంబర్ 9866843920ని  సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించగలరని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -