లిఫ్ట్ కూలి నలుగురు మృతి.. ఆరుగురికి గాయాలు
రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాలోని పవర్‌ప్లాంట్‌లో లిఫ్ట్ కూలి నలుగురు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు శక్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత శర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉచ్పిండా గ్రామంలోని దబ్రా ప్రాంతంలోగల ఆర్‌కేఎం పవర్‌జెన్ ప్రయివేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో మంగళవారం రాత్రి పదిమంది లిఫ్ట్ ఎక్కారు. నలభై అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన రాయ్ గఢ్ జిల్లాలోని జిందాల్ ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు బుధవారం ఉదయం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.
మిగతా ఆరుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ లిఫ్ట్ సామర్థ్యం దాదాపు 2 వేల కేజీలు. దాని నిర్వహణ పనులు ఇటీవలే జరిగాయి. అయితే ఈ ప్రమాదం నిర్లక్ష్యం వల్లే జరిగిందా లేదా అనే కోణంలో తెలుసుకోవడానికి ఒక పారిశ్రామిక ఇన్‌స్పెక్టర్‌ను కూడా పిలిచినట్టు ఎస్పీ అంకిత శర్మ తెలిపారు.కాగా, ఛత్తీస్‌గఢ్‌లో కేవలం పదిహేనురోజుల్లోనే మరో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్ 26న గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ ఆవరణలో ఓ నిర్మాణ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ పవర్‌ప్లాంట్‌లో ప్రమాదం
- Advertisement -
- Advertisement -