నవతెలంగాణ-హైదరాబాద్: ఝార్ఖండ్ బొగ్గు గనిలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా, మరికొందరు కార్మికులు గనిలో చిక్కుకుపోయిన ఘటన శనివారం జరిగింది. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలోని కర్మ ప్రాంతంలో గని తవ్వకాలు జరుపుతుండగా, గనిలో కొంతభాగం కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. మరికొందరు కార్మికులు చిక్కుకుపోయారు.
ఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కుజు పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జి అశుతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ … ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని వెలికితీశామని అన్నారు. గనిలో మరింతమంది చిక్కుకున్నారని వారిని బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆ స్థలంలో అక్రమ” బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక పరిపాలనా బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామని రామ్‌గఢ్ డిప్యూటీ కమిషనర్ (డిసి) ఫైజ్ అక్ అహ్మద్ ముంతాజ్ పిటిఐకి తెలిపారు.