- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన రైతు కుందేళ్ల రజిత పాడి ఆవు శుక్రవారం వ్యవసాయ బావి వద్ద ప్రమాదవశాత్తు మృత్యువాత చెందినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షం, మెరుపుల శబ్దం, పిడుగులు పడ్డట్టు తెలిపారు. దీంతో రైతు రజిత కు చెందిన రూ 80 వేలు విలువ చేసే పాడి ఆవు మృత్యువాత పడినట్లు చెప్పారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
- Advertisement -