- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్ : మండలంలోని మాధాపూర్ గ్రామంలో రమేష్ అనే వ్యక్తి పూరి గుడిసె ప్రమాదవశాత్తు నేటి మధ్యాహ్నం దగ్ధమైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న ఆర్.ఐ షఫీ పంచనమా నిర్వహించి ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. గుడిసెలో అగ్నికి ఆహుతి అయిన వాటిలో అర తులం బంగారం, రెండు పట్టిలు, ఇంట్లో సామాన్లు, దుపట్లు ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఆయనతో పాటు మాదాపూర్ గ్రామ పంచాయతి కార్యదర్శి సురేష్, బాధితులు ఉన్నారు.
- Advertisement -