- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని పోనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మారం రోడ్డులో ప్రమాదవశాత్తు ఓ రైతుకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. పోన్కల్ గ్రామానికి చెందిన రాజన్న పొలంలో వరి కొయ్యలు, గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అతి కష్టం మీద అదుపుచేశారు. ప్రమాద నష్టం అంచనా రూ.10,000/- ఉంటుందని అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.
- Advertisement -



