Monday, September 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బోరిగాంలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం...

బోరిగాంలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం…

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : ముధోల్  మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన లక్ష్మి అనేమహిళ ఇంటికి సోమవారం ఉదయం ప్రమాదవశాత్తుగా నిప్పు అంటుకోని ఇల్లు దగ్ధమైంది. స్థానికులు కధనం ప్రకారం  తన ఉన్న ఇంట్లోని దేవుళ్ళ కు దీపం ముట్టించి ఇతర గ్రామానికి బాధితురాలు బయలుదేరింది.అయితే ప్రమాదవశాత్తు ఆ దీపం ఇంటికి తగిలి మంటలు అంటుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బాధితురాలికి ఫోన్ చేసి సమాచారంను చేరవేశారు.

మంటలు చుట్టుపక్క వ్యాపించకుండా నీళ్లను స్థానికులు పోసి మంటలను  ఆర్పి వేశారు. ఇంట్లో ఉన్న బట్టలు, ఆహార ధాన్యాలు, నగదు 20వేల రూపాయలు తదితరవి, కాలి బూడిద అయ్యాయని బాధితురాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐ నారాయణ పటేల్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం కు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు.స్థానికుల సమక్షంలో  పంచనామ నిర్వహించారు. సుమారు 65 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని చేసినట్లు బాధిత మహిళ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -