Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీతో సమావేశం నిర్వహించారు. గత జూన్ 30 న సంగారెడ్డి జిల్లా, పాశమైలారం లో సంభవించిన అతిపెద్ద విస్ఫోటనాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, ప్రత్యేకించి రసాయన పరిశ్రమలు, ఔషధ యూనిట్లలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసి, ఆ కమిటీల ద్వారా ఆయా పరిశ్రమలలో భద్రతను తనిఖీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ అంశం పై సూర్యాపేట జిల్లాలో జిల్లా కలెక్టర్ ఇదివరకే పరిశ్రమలు, కార్మిక ,కాలుష్య నియంత్రణ మండలి, తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కమిటీ ఆయా రసాయనిక పరిశ్రమలు, ఔషధ యూనిట్లను తనిఖీ చేసి ఆగస్టు 14 లోగా నిర్దేశించిన ప్రొఫార్మా లో నివేదిక సమర్పించాలని , ఇదే అంశంపై నివేదిక అందిన తర్వాత తిరిగి సమీక్షిస్థానని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు ,రసాయనిక, ఔషధ యూనిట్లలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల మేనేజర్ టి. సీతారాం, జిల్లా అగ్నియాపక శాఖ అధికారి, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక శాఖ అధికారులు,ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img