నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు కావడం జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 239 ప్రకారం 2022 లో జారీచేసిన అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి ఏప్రిల్ 30 తో ముగుస్తున్నందున మే, 1వ తేదీ నుండి 2 సంవత్సరాల కాల పరిమితితో కూడిన కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
కావున జర్నలిస్టులు తేది: 12-4-2026 లోపు తప్పులు లేకుండా అన్ని దృపత్రాలతో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు. తేది: 12-4-2026 సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను మాత్రమే మొదటి అక్రిడేషన్ జాబితా కింద పరిగణనలోకి తీసుకొని జిల్లా కమిటీ ద్వారా పరిశీలన చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయబడును. నిర్ణీత గడువు తర్వాత దరఖాస్తు చేసుకున్న వారిని రెండవ జాబితాలో పరిశీలించబడుననీ తెలియజేశారు.



