Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు

- Advertisement -

ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలి : సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జీవో ఎంఎస్‌ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేయడం జరుగుతుందని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌, ఫ్రీ ల్యాన్సర్‌తోపాటు వెటరన్‌ జర్నలిస్టులు అక్రిడిటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించిందని గుర్తు చేశారు. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతున్నదన్నారు. అక్రిడిటేషన్‌ దరఖాస్తు, జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందనీ, దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా టెక్నికల్‌ సమస్యలు ఉత్పన్నమైతే సమాచార శాఖ మీడియా రిలేషన్‌ విభాగంలో సెల్‌ నెంబరు 9154170881కు కాల్‌చేసి కార్యాలయం పని వేళ్లల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలో సంప్రదించవచ్చునని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -