Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలి

అందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలి

- Advertisement -

డీజేఎఫ్‌టీ
నవతెలంగాణ – హైదరాబాద్‌

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని కోరుతూ డెస్క్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా అకాడమీ చైర్మెన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ ప్రియాంక, ఎస్‌ఏఎంసీి సమావేశంలో పాల్గొన్న అక్రెడిటేషన్‌ కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జ్యోతిబసు, ఎస్కే మస్తాన్‌ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్‌ విషయంలో డెస్క్‌ జర్నలిస్టులతో పాటు చాలా మంది రిపోర్టర్లకు, వెబ్‌ జర్నలిస్టులకు, టీవీ, కేబుల్‌ ఛానల్స్‌ లో పనిచేసే జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో డెస్క్‌ జర్నలిస్టులకు ఎడిషన్‌కు నాలుగు మాత్రమే కార్డులు ఇస్తామని నిబంధన ఉందన్నారు. ఈ నిబంధన వల్ల చాలా మంది డెస్క్‌ జర్నలిస్టులు అక్రిడిటేషన్‌లకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెబ్‌, టీవీ, కేబుల్‌ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్‌ కార్డులు సరిపోను రావడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అర్హులైన డెస్క్‌ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు వస్తాయని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో ఆయా పత్రికల యాజమాన్యాలు అర్హులైన డెస్క్‌ జర్నలిస్టుల జాబితాను ఇప్పటికే ఐఅండ్‌పీఆర్‌, డీపీఆర్‌ఓలకు అందజేసినట్టు చెప్పారు. ఆ జాబితాను పరిగణలోకి తీసుకొని కార్డులు తగ్గించకుండా, సర్క్యులేషన్‌తో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్‌టీ నాయకులు, అక్రెడిటేషన్‌ కమిటీ సభ్యులు బి.శ్రీనివాసరావు, సంఘం నాయకులు లలిత, నిస్సార్‌, విజయ, వినోద్‌ రావు, బిక్షం, రామకష్ణ, భాస్కర్‌, మనోజ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -