సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ
స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ వినతికి మంత్రి స్పందన
హైదరాబాద్ : స్పోర్ట్స్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు పునరుద్ధరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం జీవో 252లో అసరమైన మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252లో స్పోర్ట్స్, సినిమా, కల్చరర్ జర్నలిస్టులకు ప్రత్యేక కోటా లేకపోవడాన్ని స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రతినిధులు మంత్రి దష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్ టీ ప్రతినిధులతో కలిసి ప్రెసిడెంట్ క్రిష్ణా రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దాస్ మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి శ్రీనివాస రెడ్డి.. స్పోర్ట్స్ జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో మాదిరిగా స్పోర్ట్స్ జర్నలిస్టులకు ప్రత్యేక కోటాను కొనసాగించేలా జీవోలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్, నవీన్ సహా డీజేఎఫ్‌టీ ప్రతినిధులు ఉపేందర్, మస్తాన్, విజయ తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
- Advertisement -
- Advertisement -



