మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగారెడ్డి..
నవతెలంగాణ – ముధోల్
మేము చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఓ నాయకుడు తప్పుడు ప్రచారాన్ని చేయటాన్ని ఖండిస్తున్నట్లు ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి అన్నారు. నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లో ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడ్ బిడ్ గ్రామంలో ఇటీవల సిసి రోడ్డు వివాదం పై స్పందించారు. తాము గ్రామంలో ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం నిధులతో 62 లక్షలతో సిసి రోడ్డులు నిర్మించడం జరిగిందన్నారు.రెండు బోర్ బావులను కూడా తొవ్వించడం జరిగింది అన్నారు. అయితే ఇప్పటికి గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును పంచాయతీ రాజ్ అధికారులు ఆన్లైన్లో బిల్లు చేయలేదన్నారు. చేయని సిసి రోడ్డు 7లక్షల రుపాయల పనికి ఆన్లైన్లో ఎప్టీవో జనరేట్ చేశారని తెలిపారు.
నిర్మల్ పంచాయతీ రాజ్ కార్యాలయంలో తప్పిదం వల్లే ఎడ్ బిడ్ సంఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ అధికారులు విన్నపం మేరకు ఎడ్ బిడ్ లో సిసి రోడ్ ప్రారంభించినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో సిసి రోడ్డు ఆపివేసిన మాట వాస్తవం అన్నారు. కావాలని కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో, స్థానికంగా నాపై అబాండాలు వేయటం తగదన్నారు. నాపై అబండాలు వేసిన నాయకుడు గత పది సంవత్సరాల పదవి కాలంలో ఎన్ని డబ్బులు సంపాదించరో ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. తాను ప్రజల కోసమే పని చేస్తానని, తనపై కావాలని నిందలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ యువ నాయకులు రావుల శ్రీనివాస్ మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదుగుతుంటే కొంతమంది తన ఎదుగుదలకు అడ్డు తగలడం తగదన్నారు. ఆష్ట గ్రామంలో సుమారు 90 లక్షల రుపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
దీన్ని ఓర్వలేకనే తనపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే గుణపాఠం చెప్తారు అని చెప్పారు. అభివృద్ధిలో పోటీ పడలే కానీ అడ్డుకోవడంలో కాదన్నారు. ఎడ్ బిడ్ రోడ్డు విషయంలో పంచాయతి రాజ్ ఏఈఈ సస్పెన్షన్ కావడం బాధాకరమన్నారు. నిర్మల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో అధికారుల కుట్రవల్ల ఏఈఈ పై నేపం నెట్టరని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.ఈ సమావేశంలో నాయకులు ప్రేనాంధ్ రెడ్డి, పతంగి కిషన్, కిషన్ పటేల్, ఆత్మ స్వరూప్, దిగంబర్, ఖాలిధ్ పటేల్, నగేష్, అజీజ్,సందుర్ యాదవ్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని ఓర్వ లేక మాపై ఆరోపణలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES