నోరు అదుపులో పెట్టుకోండి : మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనీ, నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతారని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందనీ, ప్రజాస్వామ్యం గురించి వారు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ చేసినట్టు తామూ చేస్తే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జైళ్లో ఉండేవారని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజల తీర్పు తమకు అనుకూలంగా లేదని తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు తమపై దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయన్నారు.
ఓటమి భయంతోనే ఆరోపణలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



