Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలు..

అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలు..

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల్లో కలుగుతున్న ఆదరణ చూసి భయభ్రాంతులకు గురై అందోలు మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగన్న గారి సతీష్ కుమార్ ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండి మోసపూరితమైన హామీలతో ఎన్నో హామీలను తుంగలో తొక్కి భారాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఆదివారం నాడు ఆయన బుదేరాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధిని చూసి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఆయన ఆరోపణకు తాము ఎల్లవేళలా చర్చకు సిద్ధమని ఎవరి హాయంలో ఎంత అభివృద్ధి జరిగిందో వివరించేందుకు చర్చా వేదిక ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఆయనే బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మునిపల్లి మండలంలో ప్రస్తుతం 70 కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాటిపల్లి నుండి మక్తక్యాసారం వరకు రోడ్డుకు 22 కోట్లు, తక్కడపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి 18 కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో వట్పల్లి,కంకోల్ సింగీతం వంటి చోట్ల ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పిన ఘనత కాంగ్రెస్ దేనని అన్నారు.

నియోజకవర్గ కేంద్రంలోని జోగిపేటలో 50 లక్షల రూపాయలతో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇది క్రాంతి కిరణ్ కు కనబడడం లేదా అని సతీష్ కుమార్ ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో డబుల్ బెడ్ రూమ్ లో పేరిట కాలయాపన చేసిన అప్పటి ప్రభుత్వం ప్రతి ఊరికి వెళ్లి చూడాలని ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని అవి చూసైనా జ్ఞానోదయం కలిగించుకోవాలని సతీష్ కుమార్ హితవు పలికారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలులో దాదాపు సగం పైగా నెరవేర్చిందని ఒక్కొక్కటి ప్రజలకు అందిస్తూ మాట నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పాత జీవోలను తీసుకొచ్చి తాము అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేసిన ఆరోపణను బహిరంగంగా నిరూపించి ఆయన నిజాయితీని, నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సవాల్ విసిరారు.

పదేళ్ల కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన అప్పటి ప్రభుత్వం ఏనాడు కూడా ఆదర్శ పాఠశాలలను జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలను పట్టించుకోలేదని మునిపల్లి మండలంలోని మహిళా డిగ్రీ కళాశాలను ఆయన ఒకసారి సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను తెలుసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలని సతీష్ కుమార్ సలహా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో 10 నుండి 15 లక్షల రూపాయలు వెచ్చించి సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో కనిపించని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మభ్య పెట్టేందుకు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అనూహ్యమైన ఆదరణ లభిస్తున్నదని ఆయన మాటలు ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు నమ్మే స్థితిలో సతీష్ కుమార్ ఎద్దేవా చేశారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసిందని కుటుంబ సభ్యుల నమోదు కూడా అవకాశం ఇచ్చి నిరుపేదలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

తమ నాయకుడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విద్యా వైద్యం వంటి మౌలిక రంగాలకు విశేష ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఇకనైనా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇకనైనా పసలేని వ్యాఖ్యలు నిరాధారమైన ఆరోపణలను చేయడం మానుకోవాలని సతీష్ కుమార్ సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో రాయికోడ్ వ్యవసాయ కమిటీ చైర్మన్ మంతూరు సుధాకర్ రెడ్డి,మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు రాంరెడ్డి మాజీ ఎంపిటిసి సభ్యులు బుర్కల పాండు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad