Tuesday, February 17, 2026
E-PAPER
Homeక్రైమ్లైంగికదాడి కేసులో నిందితుడికి ఏడాది జైలు

లైంగికదాడి కేసులో నిందితుడికి ఏడాది జైలు

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
రాత్రి సమయంలో ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నిద్రిస్తున్న మైనర్ ను లేపి కత్తితో బెదిరించి అత్యాచారానికి యత్నించిన కేసులో నేరం రుజువు కావడంతో నేరస్తుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు 5 వేల జరిమానాను విధిస్తూ వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్, సునీత మంగళవారం తీర్పు వెల్లడించారని వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2019 ఆగస్టు 27వ తేదీన రాత్రి సమయంలో వెల్టూరు గ్రామంలో తన ఇంటిలో నిద్రిస్తున్న తన కుమార్తెపై అదే గ్రామానికి చెందిన దయ్యాల మహేష్ ఇంటిలోకి ప్రవేశించి 17 సంవత్సరాల తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ సంఘటనపై ఫిర్యాదుదారు 27-08-2019న పెద్దమందడి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారని డీఎస్పీ తెలిపారు.

అప్పటి పెద్దమందడి ఎస్సై,విజయ భాస్కర్, కేసు నమోదు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారని చెప్పారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి ఆమెను లేపి బలవంతానికి యత్నించాడని, ఆమె ప్రతిఘటన చేయగా కత్తితో బెదిరించి అత్యాచారానికి యత్నించి యువతి గట్టిగా అరవడంతో సమీప నివాసి సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అడ్డుకున్నప్పటికీ, నిందితుడు అక్కడి నుండి తప్పించుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు స్థానిక ఎస్సై సేకరించి చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించారని తెలిపారు. ఇది గుర్తించిన చుట్టు ప్రక్కన వారు తమ సమీప బంధువులు పోలీసులకు సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలియజేశారన్నారు. దీనిలో భాగంగా సాంకేతికంగా అవసరమైన ఆధారాలను సేకరించి నివేదికను తయారు చేసి, అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారి ఎస్సై విజయభాస్కర్, ఈ సంఘటనపై అప్పటి మొదటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి పైన పేర్కొనబడిన నిందితులను రిమాండ్కు తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారన్నారు.

జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత ఎస్సై జలంధర్ రెడ్డి, వనపర్తి కోర్టు లైజనింగ్ అధికారి కె.సత్యం, కోర్టు కానిస్టేబుల్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. శ్రీనివాసచారి వాదించారన్నారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో వాదనలు వినిపించగా నేరస్తునిపై నేరం నిరూపణ అయినందున మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్ సునీత తీర్పు వెలువరించారని  వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో నేరస్తులకు శిక్ష పడడంలో బాగా పనిచేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, కోర్టు డ్యూటీ ఆఫీసర్లను డిఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -