Tuesday, March 10, 2026
E-PAPER
Homeక్రైమ్దోపిడి కేసులో నిందితుడికి రెండేండ్ల జైలు

దోపిడి కేసులో నిందితుడికి రెండేండ్ల జైలు

- Advertisement -

జిల్లా స్పెషల్ మొబైల్ కోర్టు తీర్పు
నవతెలంగాణ – నవాబు పేట
నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ కేసులో నిందితుడికి న్యాయస్థానం శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం మహబూబ్‌నగర్ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి మొహద్ మునవర్ హుస్సేన్ తీర్పు వెలువరించిన తీర్పు ప్రకారం.. గత 07-12-2024 తేదీన నవాబ్‌పేట్ మండలం కాకర్లపహాడ్ గ్రామ పరిధిలో నిందితుడు నవాబు పేట మండల పరిధిలోని కూచూరు గ్రామానికి చెందిన పుంటికూర కర్ణాకర్ రెడ్డి బాధితురాలిని ఉడందాపూర్ గ్రామానికి వదిలేస్తానని చెప్పి తన మోటార్ సైకిల్‌పై ఎక్కించుకున్నాడు.

అనంతరం కాకర్లపహడ్ గ్రామ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి, బీర్ బాటిల్‌తో తలపై దాడి చేసి గాయపరిచి, ఆమె వద్ద ఉన్న సుమారు 4 గ్రాముల బంగారు నల్లపూసల దండ, సుమారు 20 తులాల వెండి, కాళ్ల గొలుసులు (మొత్తం విలువ సుమారు రూ.20,000) దోచుకొని మోటార్ సైకిల్‌పై పారిపోయాడు. ఈ ఘటనపై నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 263/2024 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితుడిపై చార్జ్‌షీట్ దాఖలు చేయగా, మహబూబ్‌నగర్ స్పెషల్ మొబైల్ కోర్టులో విచారణకు వచ్చింది.

కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి బీఎన్ఎస్ సెక్షన్ 309(6) ప్రకారం 2సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.2,000 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తును మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ సీఐ గాంధీ నాయక్ నిర్వహించారు. కోర్టులో ప్రభుత్వ తరఫున ఏపీపీ ఎస్.ఎన్.విశ్వ రేఖ వాదనలు వినిపించారు. ప్రస్తుతం నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విక్రమ్ విధులు నిర్వహిస్తున్నారు. కేసు డాక్యుమెంటేషన్ పనులను నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీడీఓ ఎం.విజయ్ కుమార్, పీసీ 1095 నిర్వహించారు. ఈ తీర్పుతో నిందితుడికి తగిన శిక్ష విధించబడిందని పోలీసులు తెలిపుతూ ఈ కేసు విచారణ నందు పనిచేసిన న్యాయ శాఖా అధికారులను, పోలీసు అధికారులను జిల్లా ఎస్పీడి.జానకి ఐపిఎస్ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -