రూ. 75వేల జరిమానా బాధితురాలికి
రూ.10లక్షల పరిహారం : నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి ఒడిగట్టి.. ఆ తర్వాత బలవంతంగా పెండ్లి చేసుకుని వదిలేసిన నిందితుడికి 32 ఏండ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. దాంతోపాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించినట్టు ఎస్పీ శరత్‌చంద్రపవార్ తెలిపారు. వివరాల్లోకెళ్తే.. పానగల్లుకు చెందిన నిందితుడు గురిజాల చందు నల్లగొండ టౌన్‌కు చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత బలవంతంగా పెండ్లి చేసుకుని వదిలేశాడు. దీనిపై బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందడంతో 2022లో నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురిజాల చందుపై పోక్సో యాక్టు 2012 సెక్షన్ 9 ప్రకారం.. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్టు 2006 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సాక్ష్యాధారాలు సేకరించి పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ కోర్టు లైంగికదాడులు.. పోక్సో కేసు కింద చందును నిందితునిగా నల్లగొండ అడిషనల్ జడ్జి-2 నిర్ధారించింది. 20 ఏండ్లపాటు జైలు, రూ.25 వేల జరిమానా, సెక్షన్ 366 ఐపీసీ ప్రకారం పదేండ్లపాటు జైలు, రూ.25 వేల జరిమానా, బాల్యవివాహాల నిషేధ చట్టం కింద రెండేండ్లపాటు జైలు, రూ.25 వేల జరిమానా విధించింది. మొత్తం 32 ఏండ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానాతో పాటు బాధితురాలికి డీఎస్‌ఎల్‌ఏ ద్వారా రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయమూర్తి రోజా రమణి తీర్పునిచ్చారు.
పోక్సో కేసులో నిందితుడికి 32 ఏండ్ల జైలుశిక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES