నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: నాలుగున్నర ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను శనివారం రిమాండ్ చేశామని చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధకుమార్ తెలిపారు. శుక్రవారం చౌటుప్పల్ పట్టణ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో చిన్నారిపై అఘాయితానికి పాల్పడ్డ నిందితులు A1 శివరాజ్ కోల్ తండ్రి గణేష్ కోల్, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి దివీస్ కంపెనీలో డైలీ కూలిగా లింగోజిగూడెం గ్రామం చౌటుప్పల్ మండలం, యాదాద్రిభువనగిరి జిల్లా సొంత గ్రామం మహాసా, రేవా జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం A2 దినేష్ కోల్ తండ్రి భన్వరి కోల్, వయస్సు 42 సంవత్సరాలు, కులం: రాబెస్ట్ (ST), వృత్తి:దివీస్ కంపెనీలో రోజువారీ కూలీ, చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామం, యాదాద్రిభువనగిరి జిల్లా, సొంత గ్రామం ఖుర్ద్, కట్ని, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముర్వరా కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారని చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.మన్మధ కుమార్ ఇద్దరిని నిందితులను నల్గొండ కోర్టులో రిమాండ్ చేశామని శనివారం తెలిపారు.
చిన్నారిపై అఘాయితానికి పాల్పడ్డా నిందితులను రిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



