Wednesday, October 15, 2025
E-PAPER
Homeక్రైమ్మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జైలు

మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జైలు

- Advertisement -

నవతెలంగాణ – కేతేపల్లి 
మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో నిందితునికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. కేతపల్లి ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పుల నాగార్జున (35) ఏప్రిల్ 2019 లో కేతపల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకకు వచ్చాడు. ఆ గ్రామంలో ఒక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్న మైనర్ బాలికను వేధింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా బుధవారం నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నాగార్జునకు ఫర్ రేప్ అండ్ ఫోక్సో కేసెస్ మెజిస్ట్రేట్ ఐదేళ్ల కఠిన కఠిన కారా గారా శిక్ష విధించినట్లు తెలిపారు. అదేవిధంగా మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష, రూ .20 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించేలా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా.. లైంగిక దాడులకు పాల్పడినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -