నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో బుధవారం ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వచ్చింత రాజ శ్రీనివాస్ మాట్లాడుతూ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన మహనీయులు ఆచార్య జయ శంకర్ సర్ అన్నారు. ఆయన సేవలు మరువలేనివని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు.
కాగా మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆశ్చర్య జయశంకర్ చిత్రపటానికి పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES