విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డ బోయిన గోపి అన్నారు. మోదీ గిఫ్ట్ పేరుతో పదవ తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సి,ఎస్,ఆర్ నిధులతో అందిస్తున్న సైకిలను మండలంలోని బద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి సైకిల్ లను ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ రాజు నాయక్,జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులకు 86 సైకిల్స్ పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, కోసిని వినయ్ యాదవ్, నాయకులు ,పొన్నం శ్రీనివాస్,ముత్యం,రవి,నాగుల శ్రీనివాస్, పాల్గొన్నారు.