Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయం'ప్రజా తెలంగాణ'లక్ష్యం కోసం కార్యచరణ

‘ప్రజా తెలంగాణ’లక్ష్యం కోసం కార్యచరణ

- Advertisement -

సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, న్యాయం అందిస్తాం
‘ఎక్స్‌’లో మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణ ప్రజలకు సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం అందించాలన్న ధృఢ సంకల్పం తమకు ఉందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చుతూ, సమగ్ర, సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు.

గురువారం రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అనంతరం సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను ఖర్గే అభినందించారు. ”తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి, ‘ప్రజా తెలంగాణ’ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కార్యాచరణ రూపొందించాం” అని ఆయన ట్వీట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -