Tuesday, December 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకర్ల రాజేష్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

కర్ల రాజేష్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
స్పందించిన కమిషన్‌.. నివేదిక కోసం ఆదేశాలు జారీ


నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
హుజూర్‌నగర్‌ సబ్‌ జైలు రిమాండ్‌ ఖైదీ కర్ల రాజేష్‌ మృతికి కారుకులపై చర్యలు తీసుకోవాలి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. కర్ల రాజేష్‌ కస్టడీ డెత్‌పై ఆయన సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుని తల్లి కర్ల లలితతో కలిసి కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ను నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కర్ల రాజేశ్‌ మృతికి కారకులైన పోలీసులపై సరైన చర్యలు తీసుకోలేదన్నారు.

ఈ కేసులో రెడ్డి సామాజిక తరగతికి చెందిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోకుండా ఎస్పీ ఆఫీస్‌కి అటాచ్‌ చేశారన్నారు. అలాగే బీసీ తరగతికి చెందిన రూరల్‌ సీఐ ప్రతాప్‌ లింగంపై సస్పెన్షన్‌ వేటు వేయడం అన్యాయమని అన్నారు. దళిత యువకుని లాకప్‌ డెత్‌కు కారణమైన ప్రతి పోలీస్‌ అధికారిపైనా చర్యలు చేపట్టి… భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం చూడాలని కమిషన్‌ను కోరారు. దీనిపై కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ స్పందించారు. లాకప్‌ డెత్‌ ఘటనకు కారణాలు, బాధ్యులైన పోలీసు అధికారులపై తీసుకున్న చర్యలపై జనవరి 12లోగా నివేదిక సమర్పించాలని హౌం శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -