కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కే దక్కేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సింగరేణి కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించడం ద్వారా ప్రాంతీయ ఉపాధి, సంస్థ భవిష్యత్ స్థిరత్వం, కార్మికుల భద్రతకు భరోసా లభిస్తుందని సమావేశం అభిప్రాయపడింది. ఈ క్రమంలో డిప్‌బ్లాక్‌ను సంస్థకు దక్కేలా అన్ని చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు ప్రతిపాదించాయి. అలాగే కోయగూడెం3, సత్తుపల్లి 3 బ్లాకులు కూడా సింగరేణి సంస్థకే దక్కేలా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించాయి. అనంతరం సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటే శ్వర్లును కలిసి సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, సీఐటీయూ జనరల్ సెక్రెటరీ మంద నరసింహ రావ్, టీఎన్‌టీయూసీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రాజయ్య పాల్గొన్నారు.
మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే దక్కేలా కార్యాచరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



