Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆన్సాన్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలి

ఆన్సాన్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

బీఆర్ఎస్ బలపర్షిన అభ్యర్థి దివ్య-రాజ్ కుమార్ 
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బానోత్ కిరణ్ నాయక్ అధికార దుర్వినియోగానికి పాల్పపడ్డాడు కాబట్టి అతనిపై సంబంధించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని  బిఆర్ఎస్ పార్టీ బలపర్షిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి బానోతు దివ్య-రాజు కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగాఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ పదవిలో ఉంటూ అధికార పార్టీకి సేవలు అందిస్తూ, ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ మంజూల-జగన్ గెలుపొందిన నేపథ్యంలో ఆదివారం గ్రామంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు మెంబర్ల మేడలలో పూల మాలలు వేసి శాలువాతో సన్మానం చేసారని తెలిపారు. ర్యాలీలో అధికార దుర్వినియోగం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ ను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై నవ తెలంగాణ ఉపాధిహామీ ఎపిఓ హరీష్ ను వివరణ కోరగా తన దృష్టికి రాలేదని,పూర్తి వివరాలను తెలుకుంటానన్నారు. పిల్డ్ అసిస్టెంట్ గా విజయోత్సవ ర్యాలీలో పాల్గొన రాదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -