సాంఘిక సంక్షేమ శాఖ,ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయాలి
టిపిసిసి ఎస్సి సెల్ హన్మకొండ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నాగేల్లి సురేష్
నవతెలంగాణ – పరకాల : గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించకుండా, కనీసం తల్లిదండ్రుల ఫిర్యాదులను కూడా పరిశీలించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సెక్రటరీ అలుగు వర్షినిని వెంటనే బదిలీ చేయాలని టిపిసిసి ఎస్సి సెల్ హనుమకొండ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు నాగేల్లి సురేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని టిపిసిసి ఎస్సి సెల్ హన్మకొండ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నాగేల్లి సురేష్ హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పలు విషయాలను మంత్రి దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు.
సాంఘిక సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్ లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయాలని, దూర ప్రాంతాల్లో సీట్ పొందిన పిల్లల పేరెంట్స్ అక్కడికి వెళ్లకుండా చాలా ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వెంటనే ట్రాన్స్ఫర్స్ చేపట్టి తల్లిదండ్రుల ఇబ్బందులు తొలిగించాలనన్నారు అంతేకాకుండా గురుకుల సెక్రెటరీ ఆలుగు వర్షిని పై కఠిన చర్యలు తీసుకోవాలని మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయకుండా పేరెంట్స్ యొక్క వినతి పత్రాలు స్వీకరించకుండా విద్యార్థుల తల్లిదండ్రులను నానారకంగా ఇబ్బంది గురి చేస్తున్న సెక్రెటరీ పై తక్షణం చర్యలు తీసుకొని అలుగు వర్షిని ఇతర శాఖకు బదిలీ చేయాలని మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ శాఖపరమైన నివేదికను తెప్పించుకొని చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారన్నారు.
గురుకుల సెక్రటరీ అలుగు వర్షినిపై చర్యలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES