నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రభుత్వ నిబంధనలను పాటించని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం యుఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల వెలిసిన ప్రైవేటు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల యాజమాన్యాలు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు కనీసం తరచుగా తనిఖీలు చేయకపోవడం బాధాకరం అన్నారు.
అలాగే కొన్ని ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలు జాతీయ హోటల్ నిర్వహణ మరియు క్యాటరింగ్ టెక్నాలజీ కౌన్సిల్ లేదా రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి వారి అనుమతి తీసుకోకుండానే కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు.అలాగే కొన్ని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో విద్యార్థులకు,విద్యార్థుల తల్లిదండ్రులకు విదేశాల్లో అత్యుత్తమైన హోటల్స్లో ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి లక్షలకు లక్షలు తీసుకొని వారికి సరైన విద్యను అందించకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడి వేస్తున్నారని వీటితోపాటు మరికొందరు లేని సర్టిఫికెట్స్ ని సైతం మేము అందించి ఉద్యోగాలు కల్పిస్తామని తర్వాత ఏదైనా జరిగితే తమకేమీ సంబంధం లేదన్నట్టు అగ్రిమెంటు చేసుకుంటున్నారని బాధిత విద్యార్థులు వాపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రవేటు హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు గణేష్, నగర ఉపాధ్యక్షులు వేణు, నాయకులు విశాల్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలను పాటించని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి: యుఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES